TPT: తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర శ్రవణం సంస్థను TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బుధవారం పరిశీలించారు. ఈ మేరకు DEO వెంకట సునీల్, ఎస్ఈలు వేంకటేశ్వర్లు, మనోహరం, శ్రవణం సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. ఈవో మాట్లాడుతూ.. వినికిడి లోపం గల పిల్లలకు ఆధునిక పద్ధతుల ద్వారా ప్రత్యేక శిక్షణ అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.