AP: మొంథా తుఫాన్ పంటనష్టం నమోదుకు గడువు మరో రెండు రోజులు పొడిగించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘రాష్ట్రంలో ఈ-క్రాప్ నమోదు వందశాతం జరిగింది. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తాం. ఈ-క్రాప్ నమోదు చేయలేదని జగన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఆయన వస్తే.. నమోదు అయిందో లేదో చూపిస్తా’ అంటూ సవాల్ విసిరారు.