BDK: సుజాతనగర్ సీపీఎం సీనియర్ నేత, కామ్రేడ్ గుగులోత్ ధర్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్నారు. బుధవారం మండలంలోని మంగపేట గ్రామంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ధర్మ సీపీఎం పార్టీకి ఎనలేని సేవలు చేశారని ఎమ్మెల్యే కూనంనేని తెలిపారు.