KMR: కార్టీక పౌర్ణిమ సందర్భంగా మద్నూర్ మండలంలోని సలాభాత్పూర్ హనుమాన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో సామూహికంగా 216 సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. కుటుంబ శ్రేయోభివృద్ధి, ఆరోగ్యం, అన్ని కార్యాల్లో విజయాలు కోరుకుంటూ భక్తులు పాల్గొన్నారు. ఈ వ్రతాలకు దాదాపు 25 సంవత్సరాలుగా ఆలయంలో సంప్రదాయంగా నిర్వహిస్తున్నామన్నారు.