SRCL: సిరిసిల్లకు చెందిన ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ రచించిన ‘జిగిరి’ నవల దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందింది. ఈ నవల ఇంగ్లీష్, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ, ఒరియా, పంజాబీ, సింధీ, మలయాళం తదితర 10 భాషల్లోకి అనువదించబడింది. ఒరియా, పంజాబీ భాషల్లో రెండుసార్లు అనువాదమవడంతో మొత్తం 12 అనువాదాల ఘనతను సాధించింది.