VZM: ఈనెల 14,15వ తేదీల్లో ఇన్వెస్టర్ సమ్మిట్ విశాఖలో జరగనుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విమానయాన శాఖకు సంబంధించి కూడా స్థానికంగా అభివృద్ధికి 500 ఎకరాలు అందుబాటులో ఉంచిన నేపథ్యంలో.. అందుకోసం సమ్మిట్లో ప్రెజెంటేషన్ సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు.