పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ మూవీని తెరకెక్కించనున్నాడు. మంగళవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఫొటోషూట్ కూడా జరిగినట్లు, ఆయన లుక్ను మేకర్స్ లాక్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగనున్నట్లు సమాచారం.