ATP: కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రం సర్వం సిద్ధమైంది. కర్ణాటక నుంచి తెప్పించిన ప్రత్యేక పూలతో ఆలయాన్ని అలంకరించారు. ఇవాళ తెల్లవారుజామున 2 గంటల నుంచే వేడుకలు ప్రారంభమయ్యాయి. 3 గంటలకు గండా దీపోత్సవం, 4.30 గంటలకు స్వామివారికి అభిషేకం నిర్వహించారు. స్వామి దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు.