SRD: సంగారెడ్డిలో సోమవారం ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సందీప్ కుమార్ మృత దేహానికి పూల మాలలు వేసి ఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి కల్హేర్లో మంగళవారం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సందీప్ తల్లిని ఓదార్పారు. అంత్యక్రియల నిమిత్తం రూ.25 వేలను అందించారు. ఆయన వెంట ఎస్సైలు నారాయణ, హరికృష్ణ అన్నారు.