HYD: చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ బస్సు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను టోయింగ్ వ్యాన్‌లో తరలించడంపై మాజీ మంత్రి కేటీఆర్ ‘X’ వేదికగా మండిపడ్డారు. మరణంలోనూ కనీస గౌరవం లేకపోవడం బాధాకరమని, రాష్ట్రంలో అంబులెన్స్‌లు, మార్చురీ వ్యాన్లు లేవా? అంటూ ప్రశ్నించారు. తోపుడు బండ్లు, చెత్త వ్యాన్లలో ఇలా తరలించడం అమానవీయం అని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.