2021లో తమిళనాడు ఎన్నికల సమయంలో తనపై తప్పుడు వార్తలు రావడం చూసి షాక్ అయ్యానని హీరో అజిత్ చెప్పారు. ‘పోలింగ్ కేంద్రంలో ఫోన్ వాడకూడదని రూల్ పెట్టిన కూడా ఓ వ్యక్తి అక్కడికి వచ్చి సెలబ్రిటీల ఫొటోలు తీస్తున్నాడు. అతని ఫోన్ తీసుకుని సిబ్బందికి ఇచ్చాను. దీంతో నేను అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశానంటూ నెగటివ్‌గా రాయడం చూసి ఆశ్చర్యపోయాను’ అని అన్నారు.