KKD:అ టవీశాఖ నిషేధించిన నత్తగుల్లలను అక్రమంగా తరలించుకుపోతుండగా ఈనెల 25న తాళ్లరేవు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ పట్టుకుని సీజ్ చేశారు. దీనిపై విచారణ జరిపిన జిల్లా ఫారెస్ట్ అధికారి రామచంద్రరావు, రవాణా చేసిన వ్యక్తికి రూ.1.57 లక్షల అపరాధ రుసుము విధించి, ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని DFO హెచ్చరించారు.