ప్రకాశం: మొంథా తుఫాన్ ప్రభావంతో నల్లమల్ల ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో గుండ్లకమ్మ వాగులో భారీగా వర్షపు నీరు చేరడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. మార్కాపురం మండలంలోని బోడిచర్ల, కొండేపల్లి, వేములకోట, పెద్దనాగులవరం గ్రామాల మధ్య ఉన్న వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. రహదారిపై వాగు నీరు ప్రవహిస్తుండటంతో రెవెన్యూ అధికారులు రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.