ఆచార్య సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది.. ఎవరి వల్ల అయింది.. ఇప్పటికీ ఈ చర్చ జరుగుతునే ఉంది. మెగాభిమానులు, కొరటాల అభిమానులు ఈ విషయంలో వాదోపవాదనలు చేస్తునే ఉన్నారు. వరుసగా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కొరటాల.. ఇంత చెత్త సినిమా చేశాడంటే నమ్మశక్యంగా లేదు. అలాగని మెగాస్టార్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఆచార్య పోయిందంటే కూడా నమ్మలేం. అసలు తెర వెనక ఏం జరిగిందనేది.. మెగాస్టార్, మెగా పవర్ స్టార్.. కొరటాలకు మాత్రమే తెలుసు. అయితే ఇప్పటి వరకు దీనిపై కొరటాల స్పందించలేదు. కానీ చిరు మాత్రం ఓ సందర్భంలో.. కొరటాల వల్లే సినిమా ఫ్లాప్ అయిందనేలా మాట్లాడారు. దర్శకుడు చెప్పిందే మేం చేశామని చెప్పుకొచ్చారు. దాంతో కొరటాల ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. రామ్ చరణ్ కూడా సరైన కంటెంట్ ఉంటే ఏదైనా ఆడుతుందని చెప్పారు. ఇప్పుడు సంగీత దర్శకుడు మణిశర్మ కూడా కొరటాల వల్లే ఆచార్య పోయిందన్నట్టు మాట్లాడారు. ప్రస్తుతం ఆలీతో సరదాగా కార్యక్రమంలో మణిశర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చిరంజీవికి ఏ తరహా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వాలో తనకు బాగా తెలుసని.. అందుకే చిరుకు సరిపడే వెర్షన్ ఒకటి రెడీ చేశా.. కానీ డైరెక్టర్ కొత్తగా ట్రై చేద్దామని అన్నారు.. ఫైనల్‌గా ఆచార్య నేపథ్య సంగీతం దర్శకుడి వెర్షన్’ అని చెప్పారు. దాంతో ఇండైరెక్ట్‌గా ఆచార్య సినిమా ఫ్లాప్ కొరటాలదే అని చెప్పకనే చెప్పేశారు మణిశర్మ. ఒకవేళ కొరటాల వల్లే ఆచార్య పోయి ఉంటే మాత్రం.. ఎన్టీఆర్ 30 గురించి టెన్షన్ తప్పదంటున్నారు తారక్ అభిమానులు. అయితే సినిమా అన్నాక హిట్, ఫ్లాప్ కామన్.. కాబట్టి ఒకే ఒక్క ఫ్లాప్‌తో కొరటాలను తక్కువ అంచనా వేయలేం. కాబట్టి ఎన్టీఆర్ 30తో కొరటాల సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అవడం పక్కా అని చెప్పొచ్చు.