VSP: మొంథా తుపాన్ నేపథ్యంలో వర్షంతో పాటు ఈదురు గాలులు బలంగా ఇస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలలో సోమవారం ఉదయం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. రామాటాకీస్, కైలాసపురం ఎన్జీవో కాలనీ, రైల్వే క్వార్టర్స్, కంచరపాలెం తదితర ప్రాంతాలలో చెట్లు నేలకొరిగాయి. అడపా దడపా భారీ వర్షం కూడా కురుస్తోంది. సహాయక చర్యల్లో అధికార యంత్రాంగం నిమగ్నమయ్యింది.