కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సాయంత్రం 4 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం గెలుపొందిన వారి వివరాలు ఇలా ఉన్నాయి.
బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై షిగ్గావ్ నియోజకవర్గం నుంచి 25 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.
కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సతీశ్ జార్కిహోళి ఏమకన్మద్రి నుంచి గెలిచారు.
బీజేపీ నేత హిరెకెరూర్ నియోజకవర్గంలో బీసీ పాటిల్‌పై సమీప ప్రత్యర్థి యూబీ బంకర్ గెలుపొందారు.
బెంగళూరులోని శివాజీనగర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నేత రిజ్వాన్ అర్షద్ గెలుపొందారు.
కాంగ్రెస్ సీనియర్ నేత ఎంబీ పాటిల్ బాబలేశ్వర్ నియోజకర్గం నుంచి గెలుపొందారు.
జగదీశ్ శెట్టర్‌పై హుబ్లి-థార్వాడ్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత మహేశ్ తెగనికాయి గెలిచారు.
గంగావతి నియోజకవర్గం నుంచి గాలి జనార్థన్ రెడ్డి గెలుపొందారు.
Tags :