మేడ్చల్: తెలంగాణ జైలు శాఖ ఆధ్వర్యంలో ఖైదీల మానసిక మార్పు, భావోద్వేగ వికాసం కోసం ఉద్దేశించిన “సైకోథెరపీ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్” (TOT) కార్యక్రమం చర్లపల్లి సెంట్రల్ జైలులో శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, ఐపీఎస్ డా. సౌమ్య మిశ్రా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖైదీలలో స్వీయ అవగాహన పెంచడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందన్నారు.