CBSE class 12 exam results:సీబీఎస్ఈ (CBSE) 12వ తరగతి ఫలితాల్లో ఓవరాల్గా 87.33 శాతం విద్యార్థులు (Students) పాసయ్యారు. గతేడాదితో పోలిస్తే పాస్ శాతం తగ్గింది. 12వ తరగతి ఫలితాల్లో త్రివేండ్రం (trivandrum) రిజియన్ సత్తా చాటింది. 99.91 శాతం పాస్తో టాప్ ప్లేస్లో నిలిచింది. ఈ సారి బాలికలు 90.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. అబ్బాయిల కన్నా 6.01 శాతం ఎక్కువగా పాసయ్యారు.
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి ఏప్రిల్ నెలలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. 16 లక్షల 96 వేల 770 మంది విద్యార్థులు (students) ఎగ్జామ్ రాశారు. ఫలితాలను ఈ రోజు విడుదల చేశారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్లు అని మాత్రం ప్రకటించలేదు. అది విద్యార్థుల మధ్య మంచి కాంపిటిషన్ కాదని.. అందుకే ప్రకటించడం లేదని పేర్కొంది. వివిధ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు సాధించిన 0.1 శాతం మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికేట్స్ మాత్రం ఇస్తామని తెలిపింది.
CBSE.nic.in, CBSEresults.nic.in, Digilocker.gov.inలో ఫలితాలు చూడొచ్చని పేర్కొంది. రూల్ నంబర్, స్కూల్ నంబర్, అడ్మిట్ కార్డ్ ఐటీ, డేట్ బర్త్ ద్వారా చూడొచ్చని వివరించింది.
సీబీఎస్ఈ (CBSE) సెక్యూరిటీ పిన్ డిజి లాకర్ కూడా విడుదల చేసింది. అందులో ఆరు అంకెల్ సెక్యూరిటీ పిన్ ఉంటుంది. ఆయా స్కూళ్లలో డిజిలాకర్ అకౌంట్ల ద్వారా చూడాల్సి ఉంటుంది. లేదంటే విద్యార్థులు సొంతంగా కూడా చూసే అవకాశం ఉంది. డిజి లాకర్లోనే మార్కుల షీట్, పాస్ సర్టిఫికెట్లు అందుబాటులో ఉంటాయని బోర్డు పేర్కొంది. విద్యార్థులు సొంతంగా సెక్యూరిటీ పిన్ పెట్టుకొని.. అకౌంట్ యాక్టివెట్ చేసుకోవచ్చని తెలిపింది. మార్కుల షీట్, సర్టిఫికెట్ల డిజిటల్ కాపీలను డౌన్ లోడ్ చేసుకోవచ్చని వివరించింది.