ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. పార్వతీపురం జిల్లా భామిని మండలం కాట్రగడ్డ పరిధిలో నాలుగు ఏనుగులు మృత్యువాత చెందాయి. అయితే ఇవి పొలాల్లో పెట్టిన కరెంట్ షాక్ కారణంగా మరణించాయి. ఆ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసమైందని స్థానికులు చెబుతున్నారు.
అయితే ఒడిశా నుంచి మొత్తం ఆరు ఏనుగులు వచ్చాయని, ఈ ప్రమాద ఘటన చూసి మరో రెండు ఏనుగులు తివ్వాకొండ వైపు వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ విషాద సంఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.