NLG: కర్నూలు బస్సు ప్రమాద ఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు కర్నూలు శివారులో అగ్ని ప్రమాదానికి గురై ప్రయాణికులు సజీవ దహనమైన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇలా జరగడం అత్యంత దురదృష్టకరమన్నారు.