ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్‌లోకి వచ్చిన డీజే టిల్లు.. భారీ విజయం అందుకుంది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. అలాగే హీరో సిద్ధు జొన్నలగడ్డకు బిగ్ బ్రేక్ ఇచ్చింది.. హీరోయిన్ నేహా శెట్టికి కూడా మంచి గుర్తింపు దక్కింది. అందుకే డీజె టిల్లు సీక్వెల్‌ను కాస్త గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు.
ఈ సీక్వెల్‌ను టిల్లు స్క్వేర్ అని కూడా ప్రకటించారు. అయితే ఈ సీక్వెల్లో మాత్రం.. ఇంకా మార్పులు చేర్పులు జరుగుతునే ఉన్నాయి. ఇప్పటికే దర్శకుడు విమల్ కృష్ణ స్థానంలో మల్లిక్ రామ్‌ని తీసుకున్నారు. ఇక హీరోయిన్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా ఈ సినిమాలో నేహా శెట్టికి బదులుగా శ్రీలీలను తీసుకున్నట్టు వార్తలొచ్చాయి. కానీ షూటింగ్లో జాయిన్ రెండు, మూడు రోజులకే అమ్మడు హ్యాండ్ ఇచ్చిందని తెలిసింది.
దాంతో ఈ బ్లాక్ బస్టర్ సీక్వెల్లో మరో క్యూట్ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు అనుపమా కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు టాక్. ఓ వారం రోజులు షూటింగ్లో కూడా పాల్గొన్న అనుపమ.. సడెన్‌గా షాక్ ఇచ్చిందట. హీరోయిన్ క్యారెక్టరైజేషన్‌ని తీర్చిదిద్దిన తీరు అనుపమకు నచ్చలేదట.. అందుకే తప్పుకుందట.
దాంతో ఆమె స్థానంలో మరో మలయాళీ ముద్దుగుమ్మను తీసుకున్నట్టు టాక్. ప్రేమమ్, శ్యామ్ సింగ రాయ్ వంటి చిత్రాల్లో నటించిన మడోన్నా సెబాస్టియన్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరి ఇప్పటికైనా టిల్లుగాడి గర్ల్ ఫ్రెండ్ లాక్ అవుతుందేమో చూడాలి.