»A Bus Fell Into A Valley In Madhya Pradesh Khargone District 15 People Were Killed
Breaking: లోయలో పడ్డ బస్సు..15 మంది మృతి
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోర ప్రమాదం జరిగింది. ఖర్గోన్( Khargone district) వద్ద 50 అడుగుల వంతెన పైనుంచి ఓ ప్రైవేటు బస్సు నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి(died) చెందగా..మరో 20 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
మధ్యప్రదేశ్(Madhya Pradesh)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఖర్గోన్ జిల్లా( Khargone district)లో బోరాడ్ నది వంతెనపై నుంచి ప్రయాణీకుల బస్సు ప్రమాదవశాత్తు 50 అడుగుల మేర పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా.. 25 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య 20కి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్, క్లీనర్ కూడా మృతి చెందినట్లు సమాచారం.
ఖార్గోన్లో జరిగిన బస్సు ప్రమాదంపై విషయం తెలుసుకున్న అక్కడి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్(shivraj singh chouhan) సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. దీంతోపాటు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 వేలు, ఇతర క్షతగాత్రులకు రూ.25 వేలు అందిస్తామని తెలిపారు. క్షతగాత్రులందరికీ ప్రభుత్వం చికిత్స అందిస్తుందని వెల్లడించారు. దీంతోపాటు బస్సు ప్రమాదంపై ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.
MST హిరామణి ట్రావెల్స్‌కు చెందిన MP 10 P 7755 బస్సు ఓవర్‌లోడుతో అతివేగంతో ప్రయాణించడం వల్లే ప్రమాదం(accident) జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్పీ, కలెక్టర్, ఎమ్మెల్యే సహా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.