VSP: కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శనివారం నిర్వహించే తులసి దళార్చన భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ప్రత్యేక సేవలో ఉభయదాతలు పాల్గొని అమ్మవారికి తులసి దళాలతో పూజలు సమర్పించారు. ఆలయ పూజారులు వేదమంత్రాల నడుమ కార్యక్రమాన్ని నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృప కోరారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా సాగిందని భక్తులు తెలిపారు.