ADB: చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే ఉపేక్షించేది లేదని అదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. పట్టణంలోని రహదారిపై జన్మదిన వేడుకలను జరుపుకున్న సంజీవనగర్ కాలనీకి చెందిన ఐదుగురు యువకులు షేక్ బబ్లూ, సయ్యద్ నవీద్, ఎండీ సల్మానఉద్దీన్, అముల్ మౌచీపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ఏమాత్రం సమంజసం కాదని హెచ్చరించారు.