కృష్ణా: మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. లీలా కృష్ణ ప్రసాద్ విజయవాడలోని తన నివాసంలో మంత్రి కొల్లు రవీంద్రని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.