కోల్డ్రిఫ్ దగ్గు మందు వికటించి ఇటీవల మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో 22 మంది పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. కోల్డ్రిఫ్ సిరప్ తయారీకి సంబంధించిన లైసెన్స్‌ను పూర్తిగా రద్దు చేసింది. దీన్ని తయారు చేస్తున్న తమిళనాడులోని శ్రీసన్ ఫార్మా కంపెనీని మూసివేసినట్లు తెలిపింది.