TPT: తిరుమలలో జరిగిన ఘటనపై దివ్వెల మాధురి స్పందించారు. కొండపై కేక్ కట్ చేయకూడదనే విషయం తనకు తెలియదని తెలిపారు. కేక్‌ను తానే తీసుకువచ్చి కట్ చేయించానని చెప్పారు. ఈ ఘటనతో తనూజకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తప్పు జరిగి ఉంటే తమపై కేసులు పెట్టాలని, చిన్నపిల్ల అయిన తనూజను ఇందులోకి లాగవద్దని కోరారు.