కడపలో ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలోనే ఏర్పాటు చేయాలని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున డిమాండ్ చేశారు. సోమవారం కడపలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు.