HYD: హైదరాబాద్‌లో డెలివరీ బాయ్‌ల ద్వారా గంజాయి సరఫరా అవుతున్న కొత్త దందా వెలుగులోకి వచ్చింది. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువకుడి వద్ద లభించిన గంజాయి ప్యాకెట్ల ఆధారంగా దర్యాప్తుచేసి బైక్ మెకానిక్‌ను అరెస్టు చేశారు. ఆహారపొట్లాల మధ్య గంజాయిని ఉంచి, డెలివరీ బాయ్‌లు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ప్రస్తుతం 10 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.