NRML: నిర్మల్ పట్టణంలోని గాజుల్పేట్ ప్రాంతంలో డీటీఆర్ (డబుల్ ఫీడింగ్) పనుల కారణంగా సోమవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ నాగరాజు తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కరెంట్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.