NZB: మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు మళ్ళీ తెరిచారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు తక్కువగా రావడంతో గతంలో గేట్లను నిలిపివేశారు. ప్రస్తుతం 57 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వస్తుండటంతో, 16 గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.