NLG: స్థానిక సంస్థల అంశంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారని CPI(M) నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆదివారం ఆయన MLGలో మాట్లాడుతూ.. ఎన్నికల రద్దుకు కోర్టు స్టే ఇవ్వలేదని, 42% రిజర్వేషన్ల అమలుకు చట్టబద్ధత మాత్రమే అవసరమని కోర్టు చెప్పిందని తెలిపారు. చట్టబద్ధత కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.