GDWL: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న స్వీపర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పేరు నరసింహ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ధరూర్ మండలం ఉప్పేరులో నిర్వహించిన స్వీపర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవ వ్యర్థాలను శుభ్రం చేస్తున్న స్వీపర్ల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.