»The Bride Cancels The Marriage Because The Grooms Family Give Less Gold
Gold: బంగారం తక్కువ పెట్టారని.. పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..!
కొన్నిసార్లు వివాహాలు(marriages) విచిత్రమైన సంఘటనలతో ఆగిపోతుంటాయి. నమ్మశక్యం కానీ కారణాలతో పెళ్లిళ్లను రద్దు చేసుకుంటారు. వరుడు పూలదండ సరిగా వేయలేదని ఒకరు, ఫోటోకు ఫోజులు ఇవ్వలేదని ఇంకొకరు ఇలా పలు కారణాలతో వివాహాలు ఆగిన సందర్భాలు గతంలో చుశాం. ఇటీవల ఇదే జాబితాలో మరో జంట చేరింది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
వివాహం(marriage) ఒక పవిత్ర సంబంధం. ఈ బంధంలోకి అడుగు పెట్టాలంటే ఇద్దరి అనుమతి అవసరం. కుటుంబాలు కూడా అంగీకరిస్తే వారి వివాహాన్ని మంచి మూహుర్తంలో జరిపిస్తారు. అయితే ఈ రోజుల్లో పెళ్లిళ్ల అర్థం మారిపోయింది. మండపాల మీదే పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. కొందరు పెళ్లి చేసుకున్న కొంత కాలానికే విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లి విలువను తగ్గించేస్తున్నారు.
వివాహ ఆచారాలను పూర్తిగా మార్చేస్తున్నారు. పెళ్లిలో జరిగే చిన్నచిన్న తప్పులను ఎత్తిచూపించి మరీ పెళ్లి రద్దు చేస్తున్నవారు కూడా ఉన్నారు. తాజాగా, ఓ యువతి తనకు బంగారం(gold) తక్కువ పెట్టారు అని.. తాళి కట్టే సమయంలో పెళ్లి రద్దు చేసింది. ఈ సంఘటన కాన్పూర్(up kanpur) డెహాట్ లోని సికంద్ర పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మన్పూర్ గ్రామంలో జరిగింది.
ఏప్రిల్ 30న, బాన్వారిపూర్ గ్రామానికి చెందిన ఒక అమ్మాయితో మాన్పూర్ గ్రామానికి చెందిన వరుడు వివాహం నిశ్చయించారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. మండపానికి అతిథులు వచ్చేశారు. కానీ వారి ఆచారం ప్రకారం పెళ్లికి ముందు.. వరుడు కుటుంబ సభ్యులు వధువు(bride) కోసం తెచ్చిన వస్తువులు, నగలు, దుస్తులు ప్రదర్శిస్తారట. అయితే, వరుడు కుటుంబ సభ్యులు తక్కువ బంగారం తేవడం వధువుకు నచ్చలేదు. దీంతో వరమాల వేసుకున్న తర్వాత తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని క్యాన్సిల్ చేసింది. చివరి నిమిషంలో పెళ్లి క్యాన్సిల్ చేయడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. తీరా పోలీస్ స్టేషన్ కి చేరింది.
వధువు కుటుంబం కట్నం కోసం పోలీసులకు(police) తప్పుడు ఫిర్యాదు చేసిందని వరుడి తండ్రి ఆరోపించారు. వధువు కుటుంబం వారు తీసుకున్న బంగారు ఆభరణాలు, బహుమతులను తిరిగి ఇవ్వడం లేదని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వద్ద గంటల చర్చల తరువాత.. పోలీసులు నచ్చచెప్పడంతో వారు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.