»Woman Has Not Washed Her Jeans In 18 Years Says They Look Just Like She Bought Them
Jeans : ఉతకడానికి బద్దకమా తల్లి.. 18ఏళ్లు గా ఒకటే జీన్స్ వేసుకుంటున్నావు
ఓ మహిళ దాదాపు 18 ఏళ్లుగా ఒకే జీన్స్ ప్యాంట్ ధరిస్తోంది. దానిని కొన్న తర్వాత జీన్స్ ను ఒక్కసారి కూడా ఉతకలేదట. తాను కొన్నప్పుడు ప్యాంట్ ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉందని సదరు మహిళ చెప్పడం విశేషం.
Jeans : ఈ రోజుల్లో అనేక రకాల జీన్స్ ప్యాంట్లు మార్కెట్లో ఉన్నాయి. చిరిగిన జీన్స్(Jeans), వెలిసిపోయిన జీన్స్ అనేక బ్రాండ్ కంపెనీల జీన్సలు లభిస్తున్నాయి. ఎప్పటినుంచో జీన్స్ ప్యాంట్ అంటే ఓ ట్రెండ్. జీన్స్ ధరించనివారు ప్రస్తుతం చాలా అరుదు. చిన్న పిల్లల దగ్గర నుంచి తాతల వరకు జీన్స్ ప్యాంట్(Jeans Pant) వేయాల్సిందే. అయితే మామూలు ప్యాంట్ల మాదిరిగా జీన్స్ రోజు ఉతకడం(Washing) కుదరదు.. ఎందుకంటే అవి ఎక్కువ బరువు ఉండి.. ఆరేందుకు చాలా సమయం పడుతుంది. రెండు, మూడు సార్లు వేసుకున్న తర్వాత వాటిని ఉతకుతారు. కానీ ఓ మహిళ దాదాపు 18 ఏళ్లుగా ఒకే జీన్స్ ప్యాంట్ ధరిస్తోంది. దానిని కొన్న తర్వాత జీన్స్ ను ఒక్కసారి కూడా ఉతకలేదట. తాను కొన్నప్పుడు ప్యాంట్ ఎలా ఉందో, ఇప్పటికీ అలానే ఉందని సదరు మహిళ చెప్పడం విశేషం.
కంగారు పడకండి ఆ మహిళ మన దేశపు ఆమె కాదు. లండన్(London) దేశానికి చెందిన మహిళ. ఇంగ్లాండ్ యార్క్ షైర్(England Yorkshire) కు చెందిన సాండ్రా విల్లిస్(Sandra Willis) 18ఏళ్ల కిందట షాప్ కెళ్లి రెండు డెనిమ్ జీన్స్(Denim Jeans) తెచ్చిందంట. వాటిని ఆమె ఇప్పటి వరకు ఏడాదికోసారి చొప్పున 18సార్లు మాత్రమే వేసుకుంది. ఇన్ని సార్లు వేసుకున్న వాటిపై ఎలాంటి మరకలు పడలేదట. మరకలు పడనప్పుడు ఉతకడం ఎందుకు అని మానేసిందట. కొన్న తర్వాత ఈ 18ఏళ్లలో వాటిని ఒక్కసారి కూడా వాటిని ఉతకలేదు. ఇప్పటికీ అవి చాలా కొత్తగా కనిపిస్తుండటం విశేషం. మరో రెండేళ్ల పాటు కూడా ఉతకకుండా వాడి రికార్డు(Record) క్రియేట్ చేయాలని అనుకుంటుందట ఆ మహిళ. ఈ విషయాన్ని సాండ్రా విల్లిస్(Sandra Willis) సోషల్ మీడియా(Social Media)లో షేర్ చేసింది. దీంతో విషయం కాస్త వైరల్ గా మారింది. ఆమె చేసిన పనికి నెటిజన్లు విపరీతంగా స్పందించారు. ఇంతకాలం జీన్స్ ఉతకకుండా ఎలా ధరించావు అని ఆమెకు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు.