NLG: రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కేతేపల్లి మండలంలోని ఇనుపాముల, భాగ్యనగర్, చీకటిగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ఛైర్మన్ బోళ్ల వెంకట్ రెడ్డి, నకిరేకల్ మార్కెట్ ఛైర్ పర్సన్ గుత్తా మంజుల, ఆయా గ్రామాల నాయకులు పాల్గొన్నారు.