BDK: మణుగూరు మండలం కట్టు మల్లారం గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను తహసీల్దార్ నరేష్ శనివారం రాత్రి పట్టుకున్నట్లు తెలిపారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకే రోజు వేరు వేరు ప్రాంతాలలో ఏడు ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు.