Ambedkar said reservation cannot be given on basis of religion: Assam CM Himanta
Assam CM Himanta:కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికల (Karnataka Assembly elections) సమయం దగ్గరపడుతున్న ప్రధాన పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ తీవ్రస్థాయికి చేరింది. రిజర్వేషన్ అంశాన్ని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ (Assam CM Himanta) ప్రస్తావించారు. మతపరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (ambedkar) చెప్పలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మతపరంగా రిజర్వేషన్లు కావాలని.. ప్రత్యేకించి ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటుందని విమర్శించారు.
రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలని.. ప్రయోజనాల కోసం పాటుపడటం కాదని హిమంత బిశ్వ శర్మ (CM Himanta) అన్నారు. ముస్లింలను (muslims) శాంతింపజేసేందుకు మేనిఫెస్టోలో హామీలు ఇచ్చిందని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, భజరంగ్ దళ్ నిషేధిస్తామనే ప్రకటన ఏ విధంగా చేస్తారని ప్రశ్నించారు.
సిద్దరామయ్య హయాంలో పీఎప్ఐకి వ్యతిరేకంగా ఉన్న కేసులను ఉపసంహరించుకున్నారని హిమంత బిశ్వ శర్మ (CM Himanta) గుర్తుచేశారు. పీఎఫ్ఐ, భజరంగ్ దళ్ నిషేధం విధిస్తామని చెప్పి.. ముస్లింల నుంచి మెప్పు పొందాలని చూస్తుందని తెలిపారు. ఆ సామాజిక వర్గం ఓట్లు పొందేందుకే ఇలాంటి హామీ ఇచ్చారని విమర్శించారు.
కర్ణాటకలో తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే యూనిఫామ్ సివిల్ కోడ్ (ucc) అమలు చేస్తామని.. వయో భేదం లేకుండా చూడటం, ముస్లిం మహిళలకు సమాన హక్కులను కల్పిస్తామని బీజేపీ చెబుతోంది. ఈ నెల 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఓకేసారి ఎన్నిక జరగనుండగా.. 13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడుతారు.