RR: బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో రెండు పార్కులను హైడ్రా కాపాడింది. పద్మశ్రీ హిల్స్ కాలనీలోని 2,600 గజాలు, అదేవిధంగా కాలనీకి ఆనుకొని ఉన్న PNT కాలనీలోని డీ బ్లాక్లో 1,112 గజాల పార్కు స్థలానికి కబ్జాల చేరనుంచి విముక్తి కల్పించింది. గతంలో కూడా పీ అండ్ టీ కాలనీలోని సీ, బీ బ్లాకుల్లో ఉన్న 4,400 గజాల పార్క్ స్థలాన్ని కాపాడిన విషయం తెలిసిందే.