»Bridge Collapse On Bahuda River At Ichchapuram Srikakulam District
Bahuda Riverపై కుప్పకూలిన వంతెన.. తప్పిన పెను ప్రమాదం
ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 5-6 గంటల మధ్యలో భారీ లోడుతో ఓ లారీ వచ్చింది. లారీ మధ్యలోకి చేరగానే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది.
శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) అతి పురాతన వంతెన (Bridge) కుప్పకూలింది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. అదే పగటి పూట జరిగి ఉంటే ఘోరం జరిగిపోయి ఉండేది. ఇచ్చాపురంలో (Icchapuram) జాతీయ రహదారి నుండి ఇచ్చాపురం వెళ్లే రోడ్డులో బహుదా నదిపై (Bahuda River) ఉన్న వంతెన కూలింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బహుదా నదిపై బ్రిటీష్ (British) కాలంలో వంతెనను నిర్మించారు. ఆ వంతెన శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. దీని బాగు కోసం ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రమాదకరంగా మారిన బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున 5-6 గంటల మధ్యలో భారీ లోడుతో ఓ లారీ (Lorry) వచ్చింది. లారీ మధ్యలోకి చేరగానే వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో లారీ కూడా కిందపడిపోయింది. లారీ వెనుకాల వస్తున్న వాహనదారులు కూడా ప్రమాదం బారిన పడ్డారు. 15 మంది ప్రయాణికులు గాయపడ్డారని సమాచారం. కాగా వంతెన కూలడంతో స్థానికంగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.