MLG: వెంకటాపూర్ (M) పాలంపేట గ్రామానికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తెచ్చినా స్పందన లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు దుస్థితి కారణంగా రామప్పకు వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని ఇవాళ కోరారు.