VSP: మహిళల ప్రపంచకప్లో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుతో టీం ఇండియా ఆదివారం తలపడనుంది. విశాఖ వేదికగా వైఎస్సార్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 9వ తేదీన దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో విజయం సాధిస్తుందని భావించిన ఇండియా జట్టు దురదృష్టవశాత్తూ ఓటమి చవిచూసింది. కంగారులతో మ్యాచ్ కచ్చితంగా గెలుస్తామన్నధీమాలో టీం ఇండియా ఉంది.