KMM: గ్రీస్‌లోని హాస్పిటాలిటీ, సేవా రంగాలలో 1,000 విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్ తెలిపారు. హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా/డిగ్రీ ఉన్నవారు, ప్రభుత్వ అనుమతితో నైపుణ్య ధ్రువీకరణ పొందిన అభ్యర్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తిగలవారు తమ రెజ్యూమ్‌లను tomcom.resume@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు.