MBNR: మాచన్‌పల్లి తండాకు చెందిన కె. రాజేశ్వరి మెడికల్ కాలేజీలో ప్రవేశం పొందినా, ఫీజు చెల్లించలేని దుస్థితిలో ఉంది. విషయం తెలుసుకున్న MLA యెన్నం శ్రీనివాస్ రెడ్డి అండగా నిలిచారు. తండ్రి వ్యవసాయమే జీవనాధారమని, ఆర్థికంగా బలహీనమని ఆమె MLAకు వివరించారు. ఎమ్మెల్యే వెంటనే స్పందించి విద్యానిధి నుంచి రూ.25 వేల ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.