Naga Chaitanya : ఆ ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ బాధపడుతున్నా
చైతూ..ట్రూత్ అండ్ డేర్ సెగ్మెంట్ లో ఇంటర్వ్యూర్ ఓ ప్రశ్న అడిగారు. మీ జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం ఏంటీ అని అడిగారు. దీనికి చైతూ తన జీవితంలో అలాంటిది ఏం లేదని సమాధానమిచ్చాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ ఘటన తనకు పాఠమే నన్నాడు.
Naga Chaitanya : సమంతతో విడాకుల తర్వాత అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya) ప్రస్తుతం కేరీర్ లో బిజీగా అయ్యారు. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన ఫోకస్ అంతా సినిమా(Cinema)లపైనే పెట్టారు. రెండేండ్ల కింద సామ్ – చైతూ(Samantha Chaitanya) విడిపోయిన విషయం తెలిసిందే. చై సామ్ ఎందుకు విడిపోయారనేది మాత్రం ఎవరికీ తెలియదు. దీనిపై వారూ ఎప్పుడూ స్పందించలేదు. ఈ క్రమంలోనే నాగచైతన్య(Naga Chaitanya) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడ ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య తాజా చిత్ర కస్టడీ(Custody) మే 12న రిలీజ్ అవుతోంది. . ఇందులో కృతిశెట్టి(Krithi shetty) హీరోయిన్ గా చేస్తోంది. వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అయితే తాజాగా మూవీ టీమ్ ప్రమోషన్(Movie Promotion) స్టార్ట్ చేసింది. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చైతూ..ట్రూత్ అండ్ డేర్ సెగ్మెంట్ లో ఇంటర్వ్యూర్ ఓ ప్రశ్న అడిగారు. మీ జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం ఏంటీ అని అడిగారు. దీనికి చైతూ తన జీవితంలో అలాంటిది ఏం లేదని సమాధానమిచ్చాడు. జీవితంలో ఎదురయ్యే ప్రతీ ఘటన తనకు పాఠమే నన్నాడు. ఆ వెంటనే డివోర్స్(Divorce) తర్వాత ఏదైనా బాధపడ్డ ఘటన, సినిమాల పరంగానైనా ఉందా అని మళ్లీ మరొక ప్రశ్న సంధించాడు. దీనికి చైతూ సినిమాల పరంగా చాలా బాధపడ్డ ఘటనలు ఉన్నాయి. రెండు మూడు చిత్రాల విషయాల్లో మాత్రం ఫీల్ అయ్యినట్టు తెలిపారు. ప్రస్తుతం నాగచైతన్య కామెంట్స్ వైరల్ గా మారాయి.
ఇదిలా ఉంటే.. ఇటీవల నాగచైతన్య, శోభితా దూళిపాళ(Shobhitha)తో డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఆరు నెలలుగా వీరిమధ్య లవ్ స్టోరీ(LoveStory) నడుస్తుందని త్వరలోనే పెళ్లి చేసుకుంటారాని పుకార్లు పుడుతున్నాయి. అంతే కాకుండా లండన్ లో వీరు చక్కర్లు కొట్టిన ఫొటో(Photo)లు కూడా నెట్టింట వైరల్ గా మారాయి. దీనిపై ఎప్పుడూ ఎవరూ స్పందించలేదు.