KMM: కామేపల్లి మండలం పొన్నెకల్కి చెందిన గింజల సురేందర్ రెడ్డికి ఏఎస్సైగా పదోన్నతి లభించింది. గత 36 సంవత్సరాలుగా పోలీస్ సివిల్ విభాగంలో పనిచేస్తూ, ప్రస్తుతం ఖమ్మం రూరల్‌లో ఇంటెలిజెన్స్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. పదోన్నతి పొందిన సురేందర్ రెడ్డిని ఖమ్మం ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ రామోజీ రమేష్ అభినందించారు.