HYD: తెలంగాణ జానపద, ఉద్యమ కళాకారులకు అండగా నిలుస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జానపద, ఉద్యమ కళాకారులతో సమావేశం నిర్వహించారు. జానపద కళారూపాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. జానపద కళల పరిరక్షణకు ప్రత్యేక పాలసీ రూపొందించి అమలు చేయాలన్నారు.