ప్రకాశం: వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు, రాళ్లపల్లి గ్రామాల మధ్య గత శనివారం రాత్రి పొలాల్లో చిరుత పులి సంచరించిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారాల ఆదేశాల మేరకు బీట్ ఆఫీసర్ నవీన్ కుమార్ బుధవారం గ్రామాల సరిహద్దుల్లో చిరుత పులి సంచరించిన ప్రదేశాలలో కెమెరాలు ఏర్పాటు చేశారు. పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.