KDP: టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ ఎంపీ తులసిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం లింగాల మండలం అంబకపల్లె రోడ్డు పక్కన గిట్టుబాటు ధర లేక రైతులు పారబోసిన టమాటాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా తులసి రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం ద్వారా రూ. 20 చొప్పున ప్రభుత్వమే టమాటాలను కొనుగోలు చేయాలన్నారు.