NRPT: ఉట్కూరు మండలం పులిమామిడి గ్రామం నుంచి బిజ్వార్ వెళ్లే రోడ్డులో, చెరువుకట్టపై ఉన్న అలుగు వద్ద దారి ప్రమాదకరంగా మారింది. తరచుగా ఇక్కడ ప్రమాదాలు జరుగుతుండడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థలంలో బ్రిడ్జి నిర్మిస్తేనే ప్రమాదాలు ఆగుతాయని వారు కోరుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఈ రోడ్డును మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.